NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయ శాఖ అధికారి హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో హుండీనీ లెక్కించారు. 90 రోజుల తర్వాత హుండీనీ లెక్కించగా 20,46,031 రూపాయలు, 650 గ్రాముల వెండి లభించినట్టు ఆలయ అధికారి హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మౌలీశ్వర్ రెడ్డి, అర్చకులు మహేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.