కోనసీమ: అమలాపురం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అమలాపురం MLA అయితాబత్తుల ఆనందరావు ఆదివారం ప్రారంభించారు. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, జనసేన నాయకులు కల్వకోలను తాతాజీ, నల్లా చిట్టి తదితరులు పాల్గొన్నారు.