ATP: పుట్టపర్తి మున్సిపాలిటీలోని 12వ వార్డు రాయలవారిపల్లెలో టిడిపి సీనియర్ నాయకులు కొండయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అక్కడికి వెళ్లి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామకోటి మాట్లాడుతూ పార్టీకి కొండయ్య ఎనలేని సేవ చేశారని కొనియాడారు.