E.G: విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ద్వారా అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ నియామకాల కోసం వివాహం కాని పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈనెల 13 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు, Join Indian Army వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అర్హత గల అభ్యర్థులు గమనించాలని సూచించారు.