కృష్ణా: ఉంగుటూరు మండలం మానికొండలో భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం ఇవాళ జరిగింది. ఈ మేరకు జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రాజనాల సురేష్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈనెల 15న విజయవాడలో జరగనున్న ‘చలో కమిషనరేట్ ధర్నా’లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.