ELR: చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామ శివారులో ఇవాళ పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.7,160 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.