W.G: పెదకాపవరం నుంచి క్రొవ్విడి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు అత్యంత అధ్వానంగా మారింది. పెద్ద గోతులు ఏర్పడి, నీరు నిలవడంతో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. ఈ మార్గంలో వాహనాలు తరచూ గోతుల్లో ఇరుక్కుపోతున్నాయి. రాత్రివేళ ప్రయాణం ప్రాణాలకే ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.