నెల్లూరు నగరం నవాబ్ పేటలోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని ప్రసంగించారు. చదువు, క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.