ELR: కైకలూరు మండలంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. వదర్లపాడు గ్రామం నుంచి నరసాయిపాలెం గ్రామం వరకు NABARD నిధులు ద్వారా మంజూరైన రూ.90,00,000లతో BT రోడ్డు పునరనిర్మాణం పనులకు శంఖుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల నుండి పట్టణాల వరకు రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు.