కర్నూలు: వైసీపీ-టీడీపీ నేతల మధ్య జరిగిన దాడులను ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ అండతో, పోలీసుల మద్దతుతో తమ కార్యకర్తలపై దాడులు చేసి ఎముకలు విరిగేలా కొట్టారని ఆరోపించారు. బాధితులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. డీఎస్పీ ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు.