VZM: విజయనగరం, కంటోన్మెంట్ రెల్లివీధిలో జరిగిన బాబాసాహెబ్ 134వ జయంతి వేడుకలకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావిభారత నిర్మాణంలో ముఖ్యమైన రాజ్యాంగ నిర్మాణ బృందంలో అంబేద్కర్ కీలకంగా వ్యవహరించారని, ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకాలన్నారు.