శ్రీకాకుళం పట్టణంలో ఈనెల 15వ తేదీన ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు యువనేత మాజీ డిప్యూటీ సీఎం తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.