NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కరెంట్ ఛార్జీల విషయంలో కొత్త డ్రామాను మొదలు పెట్టారని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేశ్ నాయుడు తెలిపారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని ఆయన స్పష్టం చేశారు.