BPT: చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం పంచాయతీ మోరవాగుపాలెం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి శివారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవ చూపారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన రూ.78,884చెక్కును టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.