కోనసీమ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనను జిల్లా అధికారులు సమన్వయంతో దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, పర్యటన నిర్వ హణ తీరును క్షుణ్ణంగా వివరించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు.