CTR: జిల్లాలో జనాభా గణన ప్రక్రియను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న, తాళం వేసిన గృహాలను మరోసారి పరిశీలించి పెండింగ్ వివరాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 2011 జనాభా గణాంకాలతో వ్యత్యాసాలు ఉంటే పునఃపరిశీలన చేపట్టాలని ఆదేశించారు.