E.G: రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలోని కొత్త కాలనీలోని పైప్‌లైన్ రిపేర్ కారణంగా స్థానిక ప్రజలు త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్ కాలనీ ప్రజలకు వాటర్ ట్యాంక్ ద్వారా సోమవారం నీటిని సరఫరా చేశారు. నీటి సమస్యపై స్పందించిన సర్పంచ్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.