సత్యసాయి: హిందూపురం ఎంపీ పార్థసారథి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీ.ఐ.పీ బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఎంపీని ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.