సత్యసాయి: లేపాక్షి మండలం కొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రావణి అండర్-17 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైంది. అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రాణించి రెండో స్థానం దక్కించుకుంది. ఈనెల 7 నుంచి 9 వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఉపాధ్యాయులు తెలిపారు.