SKLM: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపిన డోలా, పిన్నింటిపేట, నౌపడా రహదారి(33.2కిలోమీటర్లు)కి రూ. 55.7 కోట్లు నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మూలపేట పోర్టుకు మణిహారం లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రహదారి కోసం చొరవ చూపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.