ATP: అనంతపురంలో కానిస్టేబుల్ సతీష్ కుమార్ (38) శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానిస్టేబుల్ మృతిపై ఎస్పీ జగదీష్ సంతాపం తెలిపారు.