కృష్ణ: ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద కేంద్రం ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు లో ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కలెక్టరు లక్ష్మీశ్ అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ రెండు బ్లాక్లను ముందంజలో నిలిచేలా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం పెనుగంచిప్రోలులో క్షేత్రస్థాయిలో పర్యటించారు.