KDP: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నాలుగు గంటలకు హీరో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం బెనిఫిట్ షో వేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని సినిమా థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. అనంతరం బాలకృష్ణ భారీ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. అలాగే ప్రొద్దుటూరుకి చెందిన నాగభూషణం అనే వ్యక్తి డాకు మహారాజ్ గెటప్ వేసి ఆకట్టుకున్నాడు.