కృష్ణా: చల్లపల్లిలో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకళ్ళ జగన్నాధరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు విచ్చేసి శంకుస్థాపన చేశారు.