BPT: రాష్ట్రస్థాయి స్కిల్ డెవలప్మెంట్ పోటీలలో జిల్లా విద్యార్థినిలు సత్తా చాటారు. నిజాంపట్నం మండలం నక్షత్ర నగర్‌కు చెందిన బీసీ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ పోటీలలో ద్వితీయ స్థానం సాధించి రూ.15 వేలు నగదు బహుమతికి అందుకున్నారు. బుధవారం వారిని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.