GNTR: అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఉండవల్లిలో మంత్రి లోకేష్ ఆయన చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన దేశ సేవను, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషిని గుర్తుచేశారన్నారు. అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమని లోకేష్ అన్నారు.