PLD: గురజాల మండలం గంగవరంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి 32వ వార్షికోత్సవ కళ్యాణ వేడుకలు ఈ నెల 8న వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఇదే క్రమంలో నూతనంగా నిర్మించిన దీక్షా భవనాన్ని ప్రారంభించనున్నారు. భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.