కోనసీమ: మండపేట మండలం మారేడుబాక గ్రామంలో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల కోసం మంజూరైన మహిళా శక్తి భవన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దేవరకొండ అఖిల, తహసీల్దార్ తేజేశ్వరరావు పాల్గొన్నారు.