NLR: బోగోలు(మం) సిద్ధనపాలెం గ్రామంలో అక్రమ మద్యం అమ్ముతున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు రామలింగం నాగార్జునను మంగళవారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 58క్వాటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.