ATP: తాడిపత్రి పట్టణంలో ఇండ్ల స్థలాల కోసం ఎంహెచ్పీఎస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంహెచ్పీఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి తప్పెట్లతో ధర్నా చేశారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి నాకు మాత్రం ఇళ్ల స్థలాలు రాలేదని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు అన్నారు.