కృష్ణా: ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో సారా తయారీ కేంద్రంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ ఎ మస్తానయ్య తెలిపారు. ప్రొహిబిషన్ డిసి బి శ్రీలత, ఏలూరు జిల్లా ఏసీ నాగ ప్రభు కుమార్, జిల్లా అధికారి ఆవులయ్యల ఆదేశంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడులలో 400 లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.