VZM: కొత్తవలస కూడలి నుండి పోలీసు స్టేషన్కు వెళ్ళే దారిలో పీఎంఎల్ కాంప్లెక్స్ సమీపంలో రహదారి మధ్య గొయ్యి ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు దగ్గరికి వచ్చేవరకు గొయ్య కనబడకపోవడంతో ప్రమాద బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా మండలంలో ఉన్న కీలక అధికారులు అందరూ ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం.