NLR: సంగం మండలం జెండాదిబ్బ గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు సూరాయిపాలెం పవన్ కుమార్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చిత్రపటాన్ని బహుకరించారు. కాకినాడకు చెందిన త్రెడ్డింగ్ ఆర్టిస్టు ద్వారా 240 శీలలు, ఏడు కిలోమీటర్ల దారం, 4500 లైన్లతో ఆనం రూపాన్ని చిత్రీకరించి మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో నాయకుల సమక్షంలో బహుకరించారు.