KMM: వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చే ఇందిర భరోసాకు ఉపాధి హామీ పథకం పనితో సంబంధం పెట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కారేపల్లి భరత్ నగర్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిలేని పేదలందరికీ రూ.12 వేలు అందజేయాలని, మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.