SKLM: పాతపట్నంలో మెలియాపుట్టి, పాతపట్నం అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 42 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి నియామక పత్రాలను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ అందజేశారు. ఆయన అంగన్వాడీ కార్యకర్తల సేవలను ప్రశంసిస్తూ, సాంకేతికతతో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.