విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఈనెల 21 నుంచి 25 తేదీ వరకు జరగబోయే భవానీ దీక్ష విరమణల బందోబస్తు ఏర్పాటులను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గురువారం పరిశీలించారు. ఆలయ ఇంజినీరింగ్ అధికారులుతో కలిసి హోమ గుండాల ఏర్పాటు, ఇరుముడి పాయింట్లు, అన్నదానం, ప్రసాదం కౌంటర్లు, క్యూలైన్లను పరిశీలించారు.