PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంతో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని, ఆ దిశగా వినూత్న రీతిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు సూచించారు. ఒకే సమస్యపై ఫిర్యాదులు పలుమార్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలన్నారు.