తూ.గో: గోకవరంలో మంగళవారం రాత్రి ఎదురెదురుగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వ్యక్తిని తంటికొండ గ్రామానికి చెందిన పాల వ్యాపారి పూడి రాజుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన రాజును వెంటనే చికిత్స నిమిత్తం గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.