VZM: కొత్తవలస మండలం ముసిరాం రైతుసేవ కేంద్ర పరిధిలోని గొల్లలపాలెంలో రబీ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా సమన్వయ కర్త, వనరుల కేంద్రం అధికారిణి భారతి మాట్లాడుతూ.. జీవన ఎరువులు వాడకం, తదితర వ్యవసాయంపై ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు భానులత, ఎంఏవో పాల్గొన్నారు.