NLR: మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో ఉన్నట్టుండి మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద శబ్దంతో స్విచ్ బోర్డులు పేలడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని అన్ని గదులకు విద్యుత్ సరఫరా ఉంది. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.