SKLM: జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వివేకానంద శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పీసీని గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.