KKD: ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు భగీరథ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగలి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కలెక్టరేట్లో ఈ జయంతి కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు హాజరు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.