VSP: కేజీహెచ్ వైద్యం కోసం వెళ్లిన రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలత మృతి చెందింది. దీనిపై మృతురాలి బంధువులు కేజీహెచ్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఆమె ఓపి కోసం వెళ్లగా.. వెంటిలేటర్‌పై ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. అయితే తరలించడంలోనూ నిర్లక్ష్యం వహించడం వలనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.