VSP: భీమిలి సమీపంలోని దివిస్ లేబరెటరీస్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి. శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు టెక్నీషియన్స్ అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు వినయ్ కుమార్, హేమంత్‌ని స్థానిక ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అపోలోకి తరలించారు.