VZM: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సూచించారు. బుధవారం బాడంగి మండలం రేజేరు PHCలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ నిర్వహించారు. ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.