CTR: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్ తదితరులు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు మంత్రులకు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.