ATP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంతకల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ సాయి పోగు రంగమ్మ, టీడీపీ ఇన్ఛార్జి ఎన్.పద్మావతి మాట్లాడుతూ.. నిత్యావసర సరకులపై సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు హాజరయ్యారు.