ELR: జంగారెడ్డిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్‌ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం ప్రారంభించారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారన్నారు. నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బత్తిన లక్ష్మి పాల్గొన్నారు.