ELR: కేంద్రంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని రద్దు చేయడం పట్ల రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో అయన మాట్లాడారు. పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.