KDP: కమలాపురం నియోజకవర్గంలో 1908 మంది ఆటో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. శనివారం కమలాపురంలో MLA కృష్ణ చైతన్య రెడ్డి, TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి ఆటో డ్రైవర్లకు ఈ సహాయాన్ని అందజేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎవరికీ నష్టం జరగదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాన్ ఇర్విన్, అధికారులు పాల్గొన్నారు.